ప్రియుడికి సర్వం ఊడ్చి పెట్టిన వివాహిత…. చివరకు హ్యాండ్…

ప్రియుడికి సర్వం ఊడ్చి పెట్టిన వివాహిత.... చివరకు హ్యాండ్...

0
101

ప్రియుడి మోజులో పడి వివాహిత తన దగ్గర ఉన్న డబ్బు నగలతో పాటు సర్వం ఊడ్చి అతని చేతిలో పెట్టింది… ఆతర్వాత తాను వివాహం చేసుకోనని ఏం చేసుకుంటావో చేసుకోఅని ప్రియుడు చెప్పడంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుంది… ఈ సంఘటన కోల్ కతలో జరిగింది ఆమెకు ఒక కూతురు కూడా ఉంది… తల్లి, కూరుతుతో కలిసి ఉంటుంది ఆ వివాహిత…

ఈ క్రమంలో పెళ్లి వెబ్ సైట్ లో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు… వీరిద్దరి మధ్య సన్నిహిత్యం రోజు రోజుకు పెరిగింది తాను పెళ్లి చేసుకుంటానని ప్రియుడు చెప్పాడు.. దీంతో ప్రియుడు మాటలు నమ్మిన వివాహిత తాను చేసుకునేవాడే కదా అని అనుకుని తన దగ్గర ఉన్న డబ్బు అలాగే నగలు ఇచ్చింది.. ఆ తర్వాత ఏవేవో మాయమాటలు చెప్పి తక్కువ ధరకు ఆమె ఉంటున్న ఇంటిని కూడా అమ్మించేశాడు…

దీంతో వారు రోడ్డున పడ్డారు.. ఆ తర్వాత అతను ముఖం చాటేయడంతో ఆమె నిలదీసింది…. తాను వివాహం చేసుకోనని ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి వెళ్లిపోయాడు… దీంతో తాను మోసపోయానని ఆత్మ హత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది… వృద్దురాలైన తల్లి అలాగే ఆమె కుతూరుతో సహా అందరు నిద్ర మాత్రలు మింగి ఆత్మహాత్యకు ప్రయత్నించారు… వివాహిత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా కూతురు, తల్లి పరిస్థితి నిలకడగా ఉంది.. పోలీసులు కేసు నమోదు చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు..