ప్రియురాలితో భర్తకు వివాహం జరిపించిన భార్య – ఎందుకు ఈ నిర్ణయం అంటే

ప్రియురాలితో భర్తకు వివాహం జరిపించిన భార్య - ఎందుకు ఈ నిర్ణయం అంటే

0
109

ప్రేమించిన వారు దక్కకపోతే ఆ బాధ చాలా దారుణంగా ఉంటుంది.. జీవితంలో ప్రేమ విఫలమైన వారు వేరేవారిని వివాహం చేసుకోవడానికి అంత ఆసక్తి చూపించరు.. కాని సినిమాల్లో మనం ఒక్కోసారి చూస్తు ఉంటాం ..భర్త ఏ అమ్మాయిని ప్రేమిస్తాడో ఆ అమ్మాయిని ఇచ్చి భార్య భర్తకి పెళ్లి చేస్తుంది ఇలాంటివి సినిమా తెరపైనే కనిపిస్తాయి, నిజజీవితంలో కనిపించవు, తాజాగా ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది.

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఓ జంటకు మూడేళ్ల క్రితం పెళ్లైంది. అయితే భర్త మంచివాడు కాని అతను ఓ యువతిని ప్రేమించాడు ఈ విషయం భార్యకు తెలిసింది, తన భర్త ఆమెని మర్చిపోలేకపోతున్నాడు, ఈ విషయంలో భర్త ఎంతో మదనపడుతున్నాడు అని ఆమె గుర్తించింది.

ఒక రోజు ఆమెను కూడా పెళ్లి చేసుకుంటానని… ముగ్గురం కలిసి ఆనందంగా బతుకుదామని భార్యకు ఆయన చెప్పాడు. అయితే ముగ్గురం కలిసి బతికేందుకు చట్టం ఒప్పుకోదని మనం విడాకులు తీసుకుందాం అని తెలిపింది ఆమె, అంతేకాదు అతనికి విడాకులు ఇచ్చింది. చివరకు ప్రేమించిన ఆమెతో దగ్గరుండి వివాహం జరిపింది ఆమె, ఈ ఘటన స్టేట్ లోనే సంచలనం అయింది.