తాత్కాలిక సంబంధాలు పెట్టుకుంటూ కొంతమంది పచ్చని కాపురంలో నిప్పులు పోసుకుంటున్నారు… చివరకు హత్యలు ఆత్మహత్యలకు సైతం వెనకాడకున్నారు… తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది… ఒక మహిళ భర్త ఉండి కూడా వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది…
తర్వాత భర్తను హత్య చేయించింది… పూర్తివివరాలు ఇలా ఉన్నాయి… తూర్పుగోదావరి జిల్లా సఖినేటి పల్లిలో ప్రసాద్ ప్రశాంతిలు దంపతులు… ఈ క్రమంలో ప్రశాంతి చొప్పల్ల శివ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది… ఇక ఈ విషయం భర్తకు తెలియడంతో తన భార్యను మందలించాడు.. దీంతో ఆమె తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడనే ఉద్దేశంతో కొద్దిరోజుల క్రితం హత్య చేయించింది…
అయితే ప్రసాద్ ది సాధారణ మరణంగా భావించిన గ్రామస్తులు అతని అంత్యక్రియలు నిర్వహించారు… ఆతర్వాత 15 రోజుల తర్వాత ఫోన్ సంభాషణ ఆధారంగా ప్రసాద్ ను హత్య చేసినట్లు బయటపడింది… దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు… కేసు నమోదు చేసుకుని ప్రసాద్ మృత దేహాన్ని బటయకు తీసి పోస్ట్ మార్టంకొరకు ఆసుపత్రికి తరలించారు…