అదృష్టం అంటే ఈ రైతుదే..పొలంలొ దొరికిన వజ్రం..ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

0
111

అదృష్టం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరం చెప్పలేం. ఇక రైతుకు అదృష్టం అనే పేరే ఆమడ దూరంలో ఉంటుంది. ఎండ, వాన, చలికి వణుకుతూ వ్యవసాయం చేస్తుంటాడు రైతన్న. అలాంటి రైతన్న కష్టం చూసి ఆ దేవుడే కరుణించినట్లున్నాడు. అందుకే ఆ రైతుకు ఓ వరం ప్రసాదించి లక్షాధికారిని చేశాడు. రైతు ఉన్నట్టుండి లక్షాధికారి అవ్వడం ఏంటని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జి.ఎర్రగుడి గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబం పొలంలో కలుపు పనుల్లో నిమగ్నమై ఉంది. ఈ క్రమంలో రైతు కుమార్తెకు 10 క్యారెట్ల బరువైన వజ్రం లభించింది. విషయం తెలుసుకున్న పెరవళి, జొన్నగిరి ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యాపారులు రైతును సంప్రదించారు. వ్యాపారులంతా కలిసి దాన్ని రూ.34 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఏటా తొలకరి వర్షాల తర్వాత జొన్నగిరి, పగిడిరాయి, జి.ఎర్రగుడి, తుగ్గలి ప్రాంతాల్లోని పొలాల్లో వజ్రాలు లభించడం సాధారణమేనని స్థానికులు చెబుతున్నారు.