శ్రీశైలంలో మహాశివరాత్రి శోభ..నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

Mahashivaratri Shobha in Srisailam..Brahmotsavas from today

0
103

ఏపీలోని శ్రీశైల మహాక్షేత్రంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌లో దర్శనం టిక్కెట్లను అధికారులు విడుదల చేశారు. ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకూ 11 రోజుల పాటు మల్లన్న బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

తొలిరోజు 22న ధ్వజారోహణ, 23న స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు భృంగివాహన సేవ, 24న హంసవాహన సేవ, 25న మయూర వాహన సేవ, 26న రావణవాహన సేవ, 27న పుష్పపల్లకి సేవ, 28న గజవాహన సేవ, మార్చి 1న నందివాహన సేవ జరగనున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 1 రాత్రి పది గంటలకు లింగోద్భవకాల మహన్యా సపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, రాత్రి 12గంటలకు కల్యాణోత్సవ క్రతువును చేపట్టనున్నారు.

2న సాయంత్రం 4.30గంటలకు రథోత్సవం, 8.00 తెప్పోత్సవాలను నిర్వహించనున్నారు. 3న ఉత్సవాలకు పూర్ణాహుతి పలుకుతారు. ఉత్సవాల్లో చివరి రోజైన మార్చి 4న రాత్రి 7.30గంటలకు అశ్వ వాహన సేవ, 8గంటలకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవలు ఉంటాయి. ఆన్ లైన్ లో రూ. 200 శీఘ్రదర్శనం, రూ.500 అతిశీఘ్ర దర్శనం, ఉచిత దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. శీఘ్ర దర్శనం టికెట్లు రోజులు ఐదు వేలు అందుబాటులో ఉండగా.. అతి శీఘ్ర దర్శనం టికెట్లు రెండు వేలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.