మహిళా కండెక్టర్ పై యాసడ్ దాడి ఎందుకో తెలిస్తే షాక్

మహిళా కండెక్టర్ పై యాసడ్ దాడి ఎందుకో తెలిస్తే షాక్

0
96

మహిళలపై దాడులు అక్రుత్యాలు ఆగడం లేదు.. దారుణాతి దారుణంగా హింసిస్తున్నారు.. చిన్నపిల్లలపై కూడా వీరిపైశాచికం ప్రదర్శిస్తున్నారు.. దిశ ఘటన జరిగిన తర్వాత చట్టాల్లో మార్పులు రావాలి అని చాలా మంది కోరుతున్నారు. అయితే దాడులకు ఎవరైనా పాల్పడితే వారికి కఠినంగా శిక్షలు విధిస్తామని పోలీసులు చెబుతున్నా మూర్ఖులకు మార్పు రావడం లేదు.

తాజాగా దారుణం జరిగింది.. బెంగళూరులో ఓ మహిళా కండక్టర్ పై ఇద్దరు దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా ఈఘటన షాక్ కు గురిచేసింది.. బాగలగుంటె పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. .హవనూరు లేఅవుట్లో నివాసముంటున్న ఇందిరాబాయి పీణ్యా 9వ బీఎంటీసీ డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నారు.

ఉదయం 5.45 గంటలకు ఇంటి నుంచి డిపోకి నడిచి వెళ్తుండగా ఇద్దరు దుండగులు ఆమెపై యాసిడ్ చల్లి పరారయ్యారు. దాడిలో ఆమె ముఖం, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.. వారు ప్రయాణించిన బైక్ నెంబర్ ఆధారంగా పోలీసులు దీనిపై కేసు నమోదు చేస్తున్నారు, దీనిపై తీవ్రస్ధాయిలో ఉద్యోగులు ఫైర్ అవుతున్నారు, వారు ఎవరో కచ్చితంగా పట్టుకుని శిక్షించాలి అని కోరుతున్నారు