మహిళపై కానిస్టేబుల్ వేదింపులు

మహిళపై కానిస్టేబుల్ వేదింపులు

0
98

మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసి జైలుకు పంపారు అధికారులు… లిఫ్ట్ ఇచ్చిన మహిళను కానిస్టేబుల్ వేధింపులకు గురిచేశాడు…. దీంతో బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టి సదరు కానిస్టేబుల్ ను విధుల నుంచి సస్పెండ్ చేసి జైలుకి పంపారు…

ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.కారులో వెళుతున్న మహిళ 12 వ బెటాలియన్ కు చెందిన టీఎస్పీ కానిస్టేబుల్ వీరాబాబు లిఫ్టు అడిగారు… కారులో ఎక్కిన తరువాత మహిళ ఫోన్ నెంబర్ తీసుకొని ఆ మరుసటి రోజు నుండి ఫోన్ లో వేధింపులు మొదలుపెట్టాడు.దీంతో ఆ మహిళా కానిస్టేబుల్ వీరబాబుపై ఫిర్యాదు చేసింది…

మహిళ ఫిర్యాదును అనుసరించి ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. చట్టానికి ఎవరూ అతిథులు కారని యూనిఫారం వేసుకుని ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు నేరస్తులు సిగ్గుతో తలదించుకోవాలని మండిపడ్డారు.ఎవరి నుంచైనా ఎలాంటి వేధింపులు ఎదురైనా భరించకుండా ఫిర్యాదు చేయాలని సూచించారు అధికారులు.