మహిళల స్మార్ట్ ఫోన్ లో ఈ యాప్ ఉందా అయితే మీకు పోలీసుల రక్షణ ఉన్నట్లే…

మహిళల స్మార్ట్ ఫోన్ లో ఈ యాప్ ఉందా అయితే మీకు పోలీసుల రక్షణ ఉన్నట్లే...

0
87

ఈ మధ్య కాలంలో మహిళలపట్ల కొంత మంది అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు… బస్సుల్లో ప్రయాణించేటప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఆటోలో వెళ్లేటప్పుడు కొంతమంది అబ్బాయిలు మిస్ బిహేవ్ చేస్తుంటారు… అయితే అలాంటి వారి ఆకతాయిలను ఆటకట్టించేందుకు ఏపీ సర్కార్ దిశా యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది…

ఈ యాప్ ప్రధాన ఉద్దేశం మహిళలను రక్షించడమే… ఈ యాప్ ఉన్నవారు కేవలం ఒక్క షేర్ చేస్తే చాలు వెంటనే కంట్రోల్ రూమ్ కు హెచ్చరిక వెళ్తుంది… వెంటనే పోలీసులు జీపీఎస్ సిగ్నల్ ద్వారా వెంటనే సంఘటన స్థలానికి చేరుకుంటారు…. మీరు చేయాల్సింది ఒక్కటే…

దిశా యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి… ఆతర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆతర్వాత వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది.. ఆతర్వాత ఆల్టర్ నెట్ నంబర్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత అండ్రస్ ను పొందుపరచాలి… దీంతో రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది…