మహిళలకు తెలంగాణ డీజీపీ పిలుపు తప్పక తెలుసుకోండి

మహిళలకు తెలంగాణ డీజీపీ పిలుపు తప్పక తెలుసుకోండి

0
90

కొన్ని మానమ మృగాలు అడవిలో కాదు సమాజంలో తిరుగుతున్నాయి….అమ్మాయి కనిపిస్తే చాలు అత్యాచారానికి తెగపడుతున్నారు…దుబాయ్ లాంటి చట్టాలు అమలు చేస్తే కాని ఇక్కడ ఈతెగింపులు తగ్గవు అంటున్నాయి మహిళా సంఘాలు…ముక్కుపచ్చలారని జీవితాన్ని బుగ్గిపాలు చేశారు కొందరు కసాయిలు.

పెళ్లి పీటలెక్కాల్సిన అమ్మాయిని పాడెపై మోయించారు దుర్మార్గులు.. ప్రియాంకరెడ్డి హత్య ఉదంతం మహిళలకు వారి రక్షణ గురించి మరింత కంగారు పెట్టిస్తోంది. అందుకే పోలీసులుకూడా కీలక సూచన చేస్తున్నారు తాజాగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మహిళలకు సూచన చేశారు, చీకటి పడిన తరువాత ప్రయాణాలు చేసేవారు రాత్రి సమయాల్లో వృద్ధులు, మహిళలు ప్రయాణిస్తున్న వాహనాల్లో సమస్య వస్తే, వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏదైనా ప్రమాదంలో వున్న వారు వెంటనే 100కు లేదా 9490617111 నంబర్కు ఫోన్ చేయాలని కోరారు.

షీ టీమ్స్ ల్యాండ్ లైన్ నంబరు 040-2785 2355
వాట్సాప్ నంబరు 9490616555
సాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు 112, 1090, 1091

చూశారుగా ఎలాంటి ఆపద వచ్చినా మీరు అదైర్యపడద్దు, వారి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వండి,