మహిళా ఉద్యోగి మాస్కు వేసుకోమని చెప్పినందుకు మరీ ఇంత దారుణమా….

మహిళా ఉద్యోగి మాస్కు వేసుకోమని చెప్పినందుకు మరీ ఇంత దారుణమా....

0
117

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే… కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్కు వేసుకోమని చెప్పడమే ఆమహిళా ఉద్యోగి తప్పు అయింది… నన్నే మాస్కు వేసుకోమంటావా అంటూ మహిళా అని చూడకుండా పై అధికారి విచక్షణా రహితంగా దాడి చేశాడు…

ఈదారుణం నెల్లూరు జిల్లాలో జరిగింది… రెండు రోజుల క్రితమే ఈ దాడి జరుగగా తాజాగా వెలుగులోకి వచ్చింది.. నెల్లూరులోని ఏపీ టూరిజం హోటల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ మహిళ కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో మాస్కు వేసుకోమని భాస్కర్ ను ఆ మహిళా ఉద్యోగి కోరింది…

దీంతో ఆగ్రహించిన డిప్యూటీ మేనేజర్ భాస్కర్ ఆ మహిళా ఉద్యోగినిపై విచక్షణారహితంగా దాడి చేశాడు.. ఈ ఘటనపై మహిళా ఉద్యోగికి ఫిర్యాదు చేసింది… పోలీసులు సీసీ టీవీ పుటేజిని పరిశీలించి డిప్యూటీ మేనేజర్ భాస్కర్ ను అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు…