మహిళను స్థంభానికి కట్టేసి ఇంకా ఇలాంటి దారుణాలా

మహిళను స్థంభానికి కట్టేసి ఇంకా ఇలాంటి దారుణాలా

0
94

దారుణాలు అమానుషాలు ఇంత నాగరిక సమాజంలో అనాగరిక అవలక్షణాలు కనిపిస్తూనే ఉన్నాయి.మనిషిలో వచ్చే ఉన్మాద ఆలోచనలకు పరాకాష్టగా కొన్ని హెచ్చరిస్తున్నాయి., తాజాగా జరిగిన ఓ ఘటన ఇంతటి అమానుషంగా మనుషులు ప్రవర్తిస్తారా అని ప్రశ్నిస్తోంది.

తెలంగాణలోని పోరెడ్డిపల్లిలో తండాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. స్థల వివాదంలో జ్యోతి అనే మహిళను స్థంబానికి కట్టేసి చెప్పులతో కొట్టారు అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన హంస, స్వరూప, రమ అనే ముగ్గురు మహిళలకు పోరెడ్డి పల్లి తండాలో వ్యవసాయ భూములు ఉన్నాయి. గ్రామాల్లో పొలాలు సరిహద్దుల వివాదాలు వస్తాయి దానికి ఏకంగా ఈ మహిళలని చెట్టుకి కట్టి కొట్టారు.

అందులోకి వెళ్లే దారి విషయంలో జ్యోతితో వారికి గొడవ జరిగింది. దీంతో సదరు మహిళలు వారి, వారి భర్తలకు జ్యోతిపై ఫిర్యాదు చేశారు. దీంతో రెచ్చిపోయిన ముగ్గురు మహిళల భర్తలు జ్యోతిని గ్రామములోకి నడి బజారుకు తీసుకెళ్లి స్థంబానికి కట్టేసి కొట్టారు. దీనిపై ఆలస్యంగా పోలీసులకు విషయం తెలిసింది.. దీంతో స్ధానికులు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ఆ మహిళల భర్తలపై కేసులు నమోదు చేశారు.