మల్లారెడ్డి కాలేజీలో దారుణం ఉలిక్కిపడిన విద్యార్దులు

మల్లారెడ్డి కాలేజీలో దారుణం ఉలిక్కిపడిన విద్యార్దులు

0
121

హైదరాబాద్ లో అతి పెద్ద కాలేజీల్లో మల్లారెడ్డి కాలేజీ కూడా ఒకటి … అక్కడ అన్ని వసతులు ఉంటాయని మంచి టీచింగ్ స్టాఫ్ ఉంటారు అని క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో కూడా మల్లారెడ్డి ఫేమస్ అనే చెబుతారు ..అయితే తాజాగా ఇక్కడ ఓ షాకింగ్ సంఘటన జరిగింది.

కాలేజీలోని లేబరేటరీలో ఓ విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ అత్యాచారానికి తెగబడ్డాడు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రవల్లికి చెందిన మల్లకంటి వెంకటయ్య తార్నాకలో ఉంటూ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అంతేకాదు ల్యాబ్ లో ఇన్‌చార్జ్‌గానూ చేస్తున్నాడు.

అయితే ఓ స్టూడెంట్ ల్యాబ్ లో టెస్ట్ కోసం అని వచ్చింది. ఆమె రాగానే తలుపులు మూసేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు, తనపై ఇలాంటి అఘాయిత్యానికి మాస్టార్ పాల్పడ్డాడు అని ఇంటిలో వారికి చెప్పింది ఆమె… వెంటనే వారు అమ్మాయితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు, దీనిపై కాలేజీ యాజమాన్యం సీరియస్ అయి అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు అని తెలుస్తోంది.