మన ఇండియాలో ఈ టీ పొడి కేజీ రూ.75,000 ఏమిటి స్పెషల్

మన ఇండియాలో ఈ టీ పొడి కేజీ రూ.75,000 ఏమిటి స్పెషల్

0
111

టీ పోడి సాధారణంగా కిలో ఎంత ఉంటుంది …కిలో బ్రాండెడ్ అయితే 800 రూపాయల వరకూ ఉంటుంది… సాధారణమైన టీపొడి కిలో 400 నుంచి అమ్ముడు అవుతూ ఉంటాయి, అయితే ఈ టిపొడి క్వాలిటీ బట్టీ రేటు ఉంటుంది, మనకు తెలుసు ప్రత్యేకమైన టీ పొడి కిలో 10 వేల వరకూ అమ్మినవి ఉంటాయి అని, అయితే ఇప్పుడు వినేది మాత్రం దానికి 8 రెట్లు ఎక్కువ ధర ఉంది.

తాజాగా గౌహతీ టీ ఆక్షన్ సెంటర్ ఇటీవల ప్రత్యేకమైన టీని వేలానికి పెట్టింది. దీన్ని కొనుగోలు చేసేందుకు పలు టీ సంస్థలు పోటీపడ్డాయి. దీంతో కిలో టీపౌడర్ రూ.75 వేలకు అమ్ముడుపోయింది…కాంటేంప్రరీ దీనిని కొనుగోలు చేసింది, మరి ఎందుకు ఇది ఇంత ప్రీషియస్ అంటే కారణం ఉంది.

ఇది ప్రత్యేకమైన టీ పొడి, దీని కోసం దిబ్రూగడ్లోని టీ ఎస్టేట్ సెప్టెంబరు నెలలో ఎంతో శ్రమించారట.. సూర్యకిరణాలు ప్రసరించడానికి ముందుగానే.. టీ బడ్స్ను కోస్తారు. ఇది చక్కని వాసనతో ఉండే టీపొడి.. అందుకే కిలో అంత ధర పలికింది, ఇది చాలా ఖరీదు అయిన టీపొడిగా మన భారత్ లో రికార్డు క్రియేట్ చేసింది.