మనం ఎక్కడ పూజ జరిగినా గుడికి వెళ్లినా కచ్చితంగా కొబ్బరికాయ అరటిపండ్లు తీసుకువెళతాం, మన పెద్దవాళ్లు తీసుకువెళుతున్నారు కదా అని మనం కూడా దానిని పాటిస్తున్నాం, దాని గురించి ఎప్పుడు తెలుసుకుంది లేదు, పెద్దలను అడిగినా మా పెద్దలు ఇలా చేశారు మేము పాటిస్తున్నాం అంటారు.
అయితే పెద్దలు ఇలా చేయడానికి కారణం ఉంది అంటున్నారు.. ఈరెండు పండ్లు ఎంగిలి కాని పండ్లు అని మన పెద్దలు నమ్మేవారు, మనం ఏదైనా పండు తిని ఆ గింజలు మట్టిలో వేస్తే, అవి మళ్లీ మొక్కలుగా మారి ఫలాలు ఇస్తాయి, కాని కొబ్బరి అలా కాదు కొబ్బరి మాత్రం మొత్తంగా నాటితేనే మరో చెట్టును ఇస్తుంది, అందుకే ఇది ఎంగిలి కాని పండు అయింది.
దేవుడిని ప్రసాదంగా ఇస్తారు.ఇక అరటి కూడా అంతే తొక్క తిని చాలా మంది పక్కన పడేస్తారు. అది మట్టిలో వేసినా మొక్కరాదు, మొత్తంగా అరటి మొక్క నాటితేనే కొత్త అరటి వస్తుంది. అది దీని వెనుక ఉన్న రహస్యం. అందుకే ఈ ఎంగిలి కాని పళ్లను నైవేద్యంగా వాడేవారు.