మనం కూర్చునే ఆఫీస్ చైర్లు ఎవరు కనిపెట్టారో తెలుసా అతను పెద్ద శాస్త్రవేత్త

మనం కూర్చునే ఆఫీస్ చైర్లు ఎవరు కనిపెట్టారో తెలుసా అతను పెద్ద శాస్త్రవేత్త

0
101

మనం ఇప్పుడు ఇలా ఆఫీసుల్లో కుర్చీలో కూర్చొని పనులు చేసుకుంటున్నాం, అయితే గతంలో చెక్క బల్లలపై ఈ పని చేసేవారు కూర్చునేవారు, అంతకుముందు పీటలు పెద్దవి ఉండేవి ..తర్వాత చెక్క కుర్చీలు వచ్చాయి, మరి ఇప్పుడు సోఫా మోడల్ రివాల్వింగ్ చైర్స్ వచ్చాయి.

ఆఫీస్ వీల్ ఛైర్స్ చాలా మోడల్స్ కనిపిస్తున్నాయి, మరి ఇంత సౌకర్యంగా ఉండే ఆఫీస్ చైర్స్ ఎవరు కనిపెట్టారో ఎప్పుడైనా తెలుసుకున్నారా..ఛార్లెస్ డార్విన్.. ఈ పేరు ప్రపంచానికి సుపరిచితమే. భూమిపై జీవం ఎలా పుట్టింది అనే అంశంపై ఎన్నో సిద్ధాంతాలు, వాదనలు ఉన్నాయి.అయితే జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది డార్వినే.

ఆయన 1840లో ఎన్నో ప్రయోగాలు చేసేవారు, ఈ సమయంలో ఆయన కూర్చునే కుర్చికి నలువైపులా అనేక పరికరాలు ఉండేవి, ఇలా ప్రతీసారి లేచి తీసుకోవడం ఇబ్బందిగా మారింది, వెంటనే తర్వాత రోజు తన కుర్చీ కింద చక్రాలు అమర్చారు. దీంతో కుర్చీలో కూర్చొనే చుట్టుపక్కల ఉన్న వస్తువుల్ని తీసుకోవడం సులువైంది. ఆ తర్వాత ఆయనని చూసి చాలా మంది వ్యాపారులు ఇలా స్టార్ట్ చేశారు, ఇలా ఇప్పుడు అనేక మోడళ్లలో ఆ కుర్చీలు మన మార్కెట్లోకి వచ్చాయి.