మంచిమాట ముందురోజే యువతి ఆత్మహత్య

మంచిమాట ముందురోజే యువతి ఆత్మహత్య

0
108

మంచి మాటకు ముందు రోజు ఒక యువతి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఈ సంఘటన అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలో జరిగింది.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. షేక్ వహిదా షేక్ మసూద్ బాషా దంపతులకు ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తెకు వివాహం చేశారు.. ఈ క్రమంలోనే ఇంటర్ చదవుతున్న చిన్న కుమార్తెకు మంచి సంబంధం వచ్చింది…

రేపు ఇరు కుటుంబ సభ్యులు మంచి మాట మట్లాడుకునేందుకు సిద్దమయ్యారు… అయితే తనకు పెళ్లి వద్దని డిగ్రీ పూర్తి చేసిన తర్వాత వివాహం చేసుకుంటానని కూతురు చెప్పింది…

అయితే తల్లి దండ్రులు వినలేదు పెళ్లి చేసుకున్న తర్వాత చదువకోమని చెప్పారు… ఇక తల్లి దండ్రులకు ఎంత చెప్పినా వినకపోవడంతో ఆమె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది…