మామిడి పండ్ల కోసం కట్టుకున్న భార్యను ఛీ….

మామిడి పండ్ల కోసం కట్టుకున్న భార్యను ఛీ....

0
88

ఈ మద్య కాలంలో మహిళలపై హత్యలు ఎక్కువ అవుతున్నాయి… తాజాగా ఒడిస్సాలో దారుణం జరిగింది… భార్య మామిడిపండ్లు ఇవ్వలేదనే ఉద్దేశంతో భర్త వెదురు బొంగుతో విచక్షణా రహితంగా కొట్టాడు… దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది…. ఒడిస్సాలోని భద్రాక్ జిల్లా జలముండ గ్రామంలో కార్తిక్ తన భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు…

కార్తిక్ మద్యం తాగేవాడు… ఇదే క్రమంలో మద్యం సేవించి అర్థ రాత్రి సమయంలో ఇంటికి వచ్చాడు… తాను తెచ్చిన మామిడి పండ్లను ఇవ్వమని చెప్పాడు… మామిడి పండ్లు లేవని వాటిని పిల్లలు తిన్నారని చెప్పింది భార్య… దీంతో కొపంతో కార్తిక్ తర భార్యను వెదురు బొంగుతో కొట్టాడు…

దీంతో ఆమె అక్కడే పడిపోయింది ఇక పిల్లలు గట్టిగ అరవడంతో స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు… అయితే ఆమె అప్పటికే మరణించినట్లు డాక్టర్లు చెప్పారు… పోలీసులు కేసు నమోదు చేసుకుని కార్తిక్ ను అదుపులోకి తీసుకున్నారు…