మ‌ర‌ద‌లి కోరిక తీర్చ‌పోయి ప్రాణాలు పొగొట్టుకున్న బావ‌

మ‌ర‌ద‌లి కోరిక తీర్చ‌పోయి ప్రాణాలు పొగొట్టుకున్న బావ‌

0
103

క‌రోనాతో ఇంటిప‌ట్టున ఉండి ఉద్యోగాలు చేయ‌మంటున్నాయి కంపెనీలు, దీంతో చాలా మంది త‌మ సొంత గ్రామాల‌కు వ‌చ్చేసారు.. అక్క‌డ నుంచి ప‌నులు చేస్తున్నారు, అయితే తాజాగా కిష‌న్ అనే వ్య‌క్తి త‌న సొంత ఇంటికి గ్రామానికి వ‌చ్చేశాడు, 10 రోజులుగా ఇంటి ప‌ట్టున ఉంటున్నాడు. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నాడు.

అయితే ఉద‌యం ప‌క్క వీధిలో ఉండే మ‌ర‌ద‌లు, కాబోయే భార్య స‌ర‌దాగా చూడ‌టానికి వ‌చ్చింది, ఇద్ద‌రూ క‌లిసి ద‌గ్గ‌ర్లో ఉన్న మామిడి తోట‌కు కాయ‌ల‌కు వెళ్లారు.. ఈ స‌మ‌యంలో మామిడికాయ అడ‌గ‌టంతో అత‌ను చెట్టు ఎక్కాడు. ఈ స‌మ‌యంలో దారుణం జ‌రిగింది.

చెట్టు ఎక్కుతున్న అత‌ని కాలుపై న‌ల్ల‌తాచు కాటువేసింది, అయి‌తే తోట‌లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ఆమె ప‌క్క‌న ఉన్న వారిని పిలిచిరావ‌డానికి 30 నిమిషాలు ప‌ట్టింది, ఇక అక్క‌డ నుంచి అంబులెన్స్ వ‌చ్చే ప్లేస్ లేదు, అత‌నిని కుటుంబ స‌భ్యులు కారులో తీసుకుని అక్క‌డ నుంచి గ్రామం దాటి ఆస్ప‌త్రికి తీసుకువెళ్లారు. చికిత్స తీసుకుంటూ అత‌ను ప్రాణాలువ‌దిలాడ‌ట‌. ఎంతో విషాదం నింపింది వారి కుటుంబంలో ఈ ఘ‌ట‌న‌.