మరో దారుణం టిక్ టాక్ వీడియో కోసం ఎద్దుని చంపేశారు

మరో దారుణం టిక్ టాక్ వీడియో కోసం ఎద్దుని చంపేశారు

0
136

మధ్య టిక్ టాక్ వీడియోలు చేస్తు కొందరు వింత చర్యలకు చేష్టలకు దిగుతున్నారు, ఏకంగా జంతువులని కూడా హింసిస్తున్నారు, ఇటీవల పిల్లులు కుక్కలపై దాడి చేసి పైశాచిక ఆనందం పొందిన వారు ఉన్నారు. వినోదం కోసం రూపొందించిన ఈ యాప్ ఇప్పుడు వివాదాస్పదంగా మారిపోతున్నది.

పాపులర్ కావడం కోసం యువత దుశ్చర్యలకు పాల్పడుతూ ఆ వీడియోలను టిక్ టాక్ లో పోస్ట్ చేస్తున్నారు. తాగిన మైకంలో కొందరు యువకులు ఓ ఎద్దును రాళ్లతో కొట్టి చంపారు. ఈదారుణం తమిళనాడులో జరిగింది. తమిళనాడులోని క్రిష్ణగిరిలో నివసించే వెట్రివెల్ కు కాశీ ఈశ్వర అనే జల్లికట్టు ఎద్దు ఉన్నది. కొన్ని రోజుల క్రితం చెట్టుకు కట్టేసి ఉంచిన ఎద్దును కొందరు మందు బాబులు రాళ్లతో కొట్టి గాయపరిచారు.

గాయపడిన ఆ ఎద్దు మరణించింది. చివరకు అది ప్రమాదంలో చనిపోయింది అని అనుకున్నారు, కాని ఇది టిక్ టాక్ వీడియో తీయడానికి చంపేశారు అని తెలిసి యజమాని కేసు పెట్టారు, ఇది ఎంత అమానుషం.