ఇలాంటి బహుమతులు కూడా ఇస్తారా -కొత్త జంటకి వెరైటీ గిఫ్ట్ – వైరల్ వీడియో

Marriage Gift Video Viral

0
111

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని మరీ ఫన్నీగా అనిపిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా మనవాళ్లు మార్కెట్లో ఏదైనా వస్తువు రేటు పెరుగుతూ ఉంటే, వాటిని గిఫ్ట్ గా ప్యాక్ చేయించి పెళ్లికి సర్ ఫ్రైజ్ గిఫ్ట్ గా వధూవరులకి ఇస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ఉల్లిపాయలు, దుంపలు. పెట్రోల్ రేటు పెరిగితే ప్యాక్ చేసి మరీ ఇస్తున్నారు. ఇలా డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే పెళ్లంటే ఎన్నో తిపిగుర్తులు కదా.

అయితే ఇప్పుడు తాజాగా ఇలాంటిదే జరిగింది. ఇక్కడ స్నేహితులు ఇచ్చిన గిఫ్ట్ చాలా వెరైటీగా ఉంది. చెప్పాలంటే ఇప్పటి వరకూ ఎవరూ ఇలా ఆలోచించి ఉండరు. వధువు స్నేహితులు స్టేజీపైకి వచ్చారు. అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు. కొత్త జంటకి ఓ గిఫ్ట్ ఇచ్చారు.

అందులో ఏముందా అని చూస్తే ? అందులో చపాతీ కర్ర, మరో స్టీల్ సామాగ్రి ఉంది. దీని అర్దం పెళ్లికొడుక్కి చపాతీలు చేయమని కాదు. అబ్బాయి ఏమైనా నీ దగ్గర తోకజాడిస్తే ఈ కర్రతో కొట్టమని అర్దమట. మరి మీరు ఈ వీడియో చూసేయండి.https://www.instagram.com/p/CP2UyDTFrT8/