రామ్ నగర్ లోని ఈ లాక్ డౌన్ వేళ కృష్ణుడి ఆలయం దగ్గరలో శాండికీ – చతుర్వ అనే యువకుడికి వివాహం చేస్తున్నారు, ఈ సమయంలో పెద్దలు కుదిర్చిన పెళ్లి, దీంతో కేవలం 30 మంది ఇంటి కుటుంబ సభ్యుల మధ్య వివాహం జరుగుతోంది.
ఈసమయంలో చతుర్వ తన స్నేహితులతో కలిసి గుడి గోడ దగ్గర సీక్రెట్ గా మందు తాగాడు, అలా పెళ్లి పీటలపై కూర్చోవాలి అని అనుకున్నాడు, ఇది గమనించిన శాండీ పెళ్లి చీర కట్టుకువస్తాను అని చెప్పి లోపలికి వెళ్లింది.
చివరకు చతుర్వ స్నేహితుడు సునీల్ భండారీని ఆమె రూమ్ కి పిలిచి మాట్లాడింది.. అతనితో తాళికట్టించుకుంది, ఆమె ఎంతకీ బయటకు రాకపోవడంతో అందరూ రూమ్ తలుపు కొట్టారు, చివరకు ఇద్దరూ ఇలా పెళ్లి చేసుకుని కనిపించారు.
వారిని చూసి అందరూ షాక్ అయ్యారు, ఇలా పెళ్లికి కూడా తాగి వచ్చిన వాడితో కాపురం చెయ్యలేను అందుకే ఈ వివాహం వద్దు, అందుకే సునీల్ ని వివాహం చేసుకున్నాను అని చెప్పింది, అయితే చతుర్వ గ్యాంగ్ లో సునీల్ ఒక్కడే మందు తాగలేదు అలవాటు లేదు, అందుకే అతనిని అక్కడ ఇష్టపడి పెళ్లిచేసుకుంది.