తనకు తానే పెళ్లి..హానీమూన్ కు గోవాకు

0
125

గుజరాత్ లో మునుపెన్నడూ జరగని ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా పెళ్లి అంటే వధువు, వరుడు కలిసి చేసుకుంటారని అందరికి తెలుసు. కానీ గుజరాత్ కు చెందిన క్షమాబిందు అనే యువతీ తనకు తానే పెళ్లిచేసుకొని అందరిని ఆశ్యర్యానికి గురిచేసింది. ముహూర్తానికి 3 రోజుల ముందే నిన్న అంగరంగవైభవంగా స్వీయ వివాహం చేసుకుంది.

గుడిలో పెళ్లి చేసుకోవడానికి ఆ యువతికి అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో తమ బంధువుల, సన్నిహితుల సమక్షంలో ఇంట్లోనే గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది. సిందూరం ధరించి పెళ్లికూతురిగా మారి..వరుడు లేకుండానే తనకు తానే ఏడడుగులు నడిచి అందరిని షాక్ కు గురిచేసింది. మంగళసూత్రం కూడా తానే కట్టుకొని త్వరలో హనీమూన్ కోసం ఒంటరిగా గోవాకు వెళ్లనున్నట్టు తెలిపింది.  దీంతో దేశంలోనే తొలి సోలోగమి వివాహంగా రికార్డు సృష్టించి వార్తల్లోకి ఎక్కింది.

వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి..

https://fb.watch/dxqIEfldtk/