ప‌దిరోజుల్లో పెళ్లి కాని పెళ్లి కూతురు ఆత్మ‌హ‌త్య సూసైడ్ నోట్ లో ఏముందంటే

ప‌దిరోజుల్లో పెళ్లి కాని పెళ్లి కూతురు ఆత్మ‌హ‌త్య సూసైడ్ నోట్ లో ఏముందంటే

0
97

ఇంకా వ‌ర‌క‌ట్న స‌మ‌స్య‌లు చాలా చోట్ల వేధింపుల‌కి గురి అవుతున్నారు అమ్మాయిలు, ఇక క‌ట్న కానుక‌లు భారీగా లేక‌పోతే పెళ్లి కూడా చేసుకోము అనే వ‌రుడి బంధువులు త‌ల్లిదండ్రులు ఉంటున్నారు.. పాపం ఇలా త‌మ త‌ల్లిదండ్రుల‌కి త‌మ పెళ్లితో భారం అయ్యాము అనే కార‌ణంతో ఇద్ద‌రు అమ్మాయిలు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

హైదరాబాదు శివార్లలో ఒకే గదిలో గౌతమి, మమత అనే ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్రనగర్ లో ఈ ఘటన జరిగింది. ఈ ఇద్ద‌రు అమ్మాయిలు స్నేహితులే.

ఇక వ‌చ్చే 10 రోజుల్లో మ‌మ‌త వివాహం ఉంది, ఆమె పేరెంట్స్ ఓ పెళ్లికి వెళ్లారు, ఇక సోద‌రుడు స్కూల్ కి వెళ్లాడు మ‌మ‌త గౌత‌మి మాత్ర‌మే ఇంట్లో ఉన్నారు, అయితే సాయంత్రం త‌మ్ముడు ఇంటికి వ‌చ్చేస‌రికి ఇద్ద‌రూ కూడా ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

ఇద్దరమ్మాయిలు రాసిన సూసైడ్ నోట్ లో క‌న్నీరు తెప్పించింది.. తాము తమ తల్లిదండ్రులకు భారం అయ్యామని, పెళ్లికి భారీగా లాంఛనాలు సమర్పించుకోవాల్సి వస్తోందని రాసారు, దీంతో వారి బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు.