మెడికల్ విద్యార్థినిపై డాక్టర్ వేధింపులు…

మెడికల్ విద్యార్థినిపై డాక్టర్ వేధింపులు...

0
97

పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న ఓ మెడికల్ విద్యార్థిని హత్యకు గురి అయింది… ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రాలో చోటు చేసుకుంది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల యువతి ఆగ్రాలోని ఓ మెడికల్ కాలేజీలో పోస్టు గ్రాడ్యుయేట్ చుదోవుతోంది…

అయితే జలౌన్ సిటీలో డాక్టర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి ఆయువతిని కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు..ఈక్రమంలో ఆమె అదృష్యం అయింది…దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టి ఆమె మృత దేహాన్ని గుర్తించారు…

ఆమె మెడపై గాయాలు ఉన్నట్లుపోలీసులు గుర్తించారు… డాక్టరే తమ కూతురుని హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు…. పోలీసులు కేసు నమోదు చేసుకుని డాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు…