ఏపీలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనను అధికారులు ప్రకటించారు. నైరుతిబంగాళాఖాతం.. దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్లు ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై పడనుంది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది వాతావరణశాఖ.
ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ,ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ,ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
రాయలసీమలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.