హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్..ఒక్కరోజే ఎంతమంది ప్రయాణించారంటే?

0
99

హైదరాబాద్ మెట్రో నయా రికార్డ్ సృష్టించింది. శుక్రవారం ఒక్కరోజే మెట్రోలో 4 లక్షల మంది ప్రయాణించారని అధికారులు వెల్లడించారు. మియాపూర్- ఎల్బీనగర్ కారిడాలో 2.46 లక్షల మంది, నాగోల్-రాయదుర్గం కారిడార్ లో 1.49 లక్షల మంది, జేబీఎస్-ఎంజిబిఎస్ కారిడార్ లో 22 వేల మంది ప్రయాణించారు. గణనాథుల నిమజ్జనం సందర్బంగా అధిక మంది ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకున్నట్టు తెలుస్తుంది.