పాల ప్యాకెట్ ఓపెన్ చేసి లోపల చూసి షాక్

పాల ప్యాకెట్ ఓపెన్ చేసి లోపల చూసి షాక్

0
130

అంతా కల్తీమయం అయిపోతోంది.. డబ్బుపై ఆశతో తినే తిండిలో కూడా కలుషితం – కల్తీ చేస్తున్నారు కొందరు వ్యాపారులు.. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పాలను వేడిచేయగా అది మొత్తం ప్లాస్టిక్ పదార్థంలా మారింది. ఆ పదార్థాన్ని లాగితే సాగుతోంది. భూమికి కొడితే బంతిలా ఎగురుతోంది. ఓ వ్యక్తి పాలను తీసుకుని వచ్చాడు వాటిని కాచాడు కాని అవి విరిగిపోయాయి..

దీంతో ఆ పాలను పాడేయకుండా వాటిని వేడిచేసి అందులో షుగర్ వేసుకుని తిందాం అనుకున్నాడు
.. మరింతగా మరిగించగా అవి కాస్తా ప్లాస్టిక్ ముద్దలాగా మారిపోయాయి. ఈ వింతను చూసి షాకయ్యాడు, అంతేకాదు పాల నుంచి ప్లాస్టిక్ వాసన వస్తోంది.

ఇక పాలకేంద్రంలో కొన్న పాలు ఇలా ఉన్నాయని వెంటనే పోలీసులకి తెలిపాడు, మరోఅరలీటర్ పాలు కొన్నా అది కూడా అలాగే వాసన వచ్చింది, పాలలో రసాయనాలు కలుపుతున్నారని భావించారు, ఇలా పాలల్లో కూడా ప్లాస్టిక్ కల్తీ జరగడం పై అందరూ షాక్ అయ్యారు. ఇలా చిక్కగా పాలు అయ్యేందుకు ఇలాంటి ప్లాస్టిక్ రసాయనాలు కలుపుతున్నారు అని గుర్తించారు, ఇలాంటి పాలు ఎక్కడైనా గుర్తిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.