పాలు తాగిన పాము – ఆ పాలు తాగిన కవలలు- విషాదం

పాలు తాగిన పాము - ఆ పాలు తాగిన కవలలు- విషాదం

0
134

పాము శరీరం నిలువెల్ల విషం…. దాని కోరల్లో ఒక్క విషం చుక్క చాలు ఏకంగా 20 మంది ప్రాణాలను తీయగలదు అంటారు, అయితే పాపం కవలలు ప్రాణాలు కోల్పోయారు ఈ పాము వల్ల.
రాత్రి పూట ఇద్దరు కవలలు పాల కోసం ఏడ్చారు ఈ సమయంలో తండ్రి లేచి వారికి పాలు ఇచ్చాడు, అయితే వారు తాగి పడుకున్నారు.. కాని ఉదయం మాత్రం వారు లేవలేదు. నోటి నుంచి నురగ వచ్చింది. కంగారుగా ఆస్పత్రికి తీసుకువెళితే వారు చనిపోయారు అని వైద్యులు తెలిపారు.

యూపీలోని గాజీపూర్లోగల మర్ద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛోట్నామర్ద్ గ్రామంలో ఈ విషాధ ఘటన చోటు చేసుకుంది. రాత్రి పూట 2 గంటల సమయంలో తండ్రి పట్టిన పాలు తాగి నురుగలు కక్కిన కవలలను చూసి వారి తల్లిదండ్రులు షాకయ్యారు.

అందరూ కలిసి ఆస్పత్రికి తీసుకువెళితే వారిని ముందు పరీక్షించిన వైద్యులు పాము కరిచింది అని అనుకున్నారు.. కాని వారి శరీరంపై ఎలాంటి గాటు లేదు.. దీంతో ఇంటిలో ఓ పాము కనిపించింది. అది కప్పను మింగుతూ ఉంది.. అది కూడా పాలు తాగి ఉంటుంది అని భావించారు ఈ సమయంలో అవి విషపూరితం అయి ఉంటాయి అని భావిస్తున్నారు పోలీసులు, నిజంగా ఆ తల్లిదండ్రుల బాధ చాలా దారుణం ఎవరూ వారిని ఓర్చలేకపోయారు.