మిస్ వరల్డ్ 2021 కరోలీనా బీలాస్కా..రన్నరప్​గా భారత యువతి

0
104

మిస్ వరల్డ్ 2021 కిరీటాన్ని పోలెండ్ అందగత్తె కరోలీనా బీలాస్కా దక్కించుకుంది. పోర్టోరికోలోని శాన్ జువాన్ కోకా కోలా మ్యూజిక్‌హాలులో జరిగిన ప్రపంచ అందాల పోటీల్లో న్యాయ నిర్ణేతలు విజేతగా కరోలినా బీలాస్కా పేరును ప్రకటించారు. ప్రపంచ సుందరి పోటీల్లో భారతీయ సంతతికి చెందిన అమెరికా అమ్మాయి శ్రీసైని ఫస్ట్ రన్నరప్‌గా నిలవడం విశేషం. కోట్ ది ఐవరీకి చెందిన ఒలీవియా యేస్ సెకండ్ రన్నరప్ గా నిలిచింది.