Alert: 17 వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు

0
119

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 34 ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. వర్షాల కారణంగా ఈనెల 14 నుంచి 17 వరకు 34 ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు.

లింగంపల్లి-హైదరాబాద్‌ రూట్‌లో 9 సర్వీసులు, హైదరాబాగ్‌-లింగంపల్లి మార్గంలో 9, ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య 7 సర్వీసులు, లింగంపల్లి -ఫలక్‌నుమా రూట్‌లో 7 సర్వీసులు, సికింద్రాబాద్‌-లింగంపల్లి రూట్‌లో ఒకటి, లింగంపల్లి సికింద్రాబాద్‌ మార్గంలో ఒక సర్వీసు రద్దు చేశారు.

ఉందానగర్- మేడ్చల్ మెము స్పెషల్, సికింద్రాబాద్-బొల్లారం మెము స్పెషల్, బొల్లారం-సికింద్రాబాద్ మెము స్పెషల్, మేడ్చల్-సికింద్రాబాద్ మెము స్పెషల్, సికింద్రాబాద్-మేడ్చల్ మెము స్పెషల్ రైళ్లను ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.