పురుషులు మొలత్రాడు ఎందుకు కట్టుకుంటారు ? ఎప్పుడు దానిని తీసేస్తారో తెలుసా

పురుషులు మొలత్రాడు ఎందుకు కట్టుకుంటారు ? ఎప్పుడు దానిని తీసేస్తారో తెలుసా

0
90

హిందూ సాంప్రదాయం ప్రకారం చిన్న వయసు నుంచి మగపిల్లలకు మొలత్రాడు కడతారు, అయితే చిన్న తనంలో దీనిని బంగారం వెండితో కూడా తయారు చేసి పిల్లలకు కడతారు, లేదా సిల్క్ కాటన్ తో తయారు చేసిన మొలతాడు కడతారు. ఇది పురుషుడు బతికి ఉన్నంతకాలం కట్టుకుంటాడు.

ఈ మధ్య చాలా మంది ప్లాటినమ్ తోను ఈ మొలతాడును తయారు చేయించుకుంటున్నారు, అయితే ఏ మొలతాడు అయినా మగవారు ధరించవచ్చు, అయితే చిన్నతనం నుంచి ఇది మనకు కట్టడం మన హిందూ సంప్రదాయాల్లో భాగం అయింది.

ఇది కచ్చితంగా మారిస్తే కొత్తది ధరించిన తర్వాత పాతది తీసేయాలి, అది కూడా మొక్కల పై లేదా భూమిలో కప్పివేయాలి అని పెద్దలు చెబుతారు, అయితే ఇలా చేయడం వెనుక మనకు ఇది ఓ రక్షగా చెబుతారు, మనకు కట్టే తాయెత్తులకి చిన్నతనం నుంచి రక్షగా ఉంటుంది కాబట్టి దీనిని కూడా జీవితాంతం ఉంచుకోవాలి అని చెబుతారు.

పురుషుడి భార్య కాలం చేస్తే గానీ మొలత్రాడు తీయకూడదు అనే నమ్మకం ఇప్పటీకీ చాలా మందికి ఉంది, మళ్లీ అతను వివాహం చేసుకుంటే మొలతాడు కట్టుకుంటాడు. అయితే కొందరు ఇది పాటిస్తారు మరికొందరు పాటించరు.