కోతికి జీవిత ఖైదు శిక్ష ? ఎందుకు విధించారంటే ఇది చేసిన త‌ప్పు

కోతికి జీవిత ఖైదు శిక్ష ? ఎందుకు విధించారంటే ఇది చేసిన త‌ప్పు

0
110

కొన్ని కోతులు చేసిన ప‌నులు ఏకంగా మ‌నిషి ప్రాణాలు కూడా పోయేలా చేస్తాయి, ఏకంగా అవి క‌రిచాయంటే వింత‌గా ప్ర‌వ‌ర్తించి చివ‌ర‌కు చ‌నిపోయిన వారు ఉన్నారు, శ‌రీరాన్నీ కూడా కొరికేస్తాయి, అయితే ఉత్తరప్రదేశ్… కాన్పూర్‌లో ఓ కోతిని జూ అధికారులు జైలు లాంటి బోనులో బంధించారు.

దానికి జీవిత ఖైదు విధించారు. ఇలా ఎక్కడా జరిగి ఉండదేమో. ఆరేళ్ల కిందట మిర్జాపూర్ జిల్లాలో పుట్టింది కల్వా. దీనిని ఓ వ్య‌క్తి పెంచుకున్నాడు, ఇలా దీనికి మ‌ద్యం అల‌వాటు చేశాడు, చివ‌ర‌కు మ‌ద్యానికి బానిస అయింది, అతనితో మ‌ద్యం తాగుతూ ఉండేది, చివ‌ర‌కు ఆ వ్య‌క్తి చ‌నిపోయాడు, త‌ర్వాత మ‌ద్యం దొర‌క్క ఆ కోతికి పిచ్చి ఎక్కింది.

ఎవరు కనిపిస్తే వాళ్లపై దూకి… దాడి చేయడం, కొరకడం మొదలుపెట్టింది. అది అసలే పెద్ద కోతి కావడంతో… దాన్ని ఎవరూ అడ్డుకోలేకపోయారు. ఆ కోతి 250 మందిని కరిచింది. చివ‌ర‌కు జూ అధికారులు దానిని ప‌ట్టుకున్నారు, ఇది క‌ర‌వ‌డంతో ఓ వ్య‌క్తి చ‌నిపోయాడు, దీనిలో మార్పు రాక‌పోవ‌డంతో
కోతి జైలుపాలైనట్లైంది.