అమ్మాయిలని వేధించే వారికి పోలీసులు చుక్కలు చూపిస్తారు, అయితే పోలీసు వారి కుటుంబాల జోలికి వెళ్లినా వారి పిల్లల జోలికి వెళ్లినా ఇక ఎలాంటి పరిస్దితి ఉంటుందో తెలిసిందే. అయితే ఓ ఏఎస్‌ఐ తన కుమార్తెని వేధిస్తున్నారు అని స్టేషన్ కు పిలిచి వార్నింగ్ ఇచ్చింది.. అయినా వారి పద్దతి మారలేదు చివరకు ఏమైందంటే.
ఓ పత్రిక విలేకరి, గ్రామ పంచాయితీ సభ్యుడి లైంగిక వేధింపులను భరించలేకపోతున్నానంటూ, యువ అధికారిణి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన కర్ణాటకలో కలకలం రేపింది`భారతీనగర్ లో గ్రామ పంచాయితీ అధికారిణిగా అనితా రాజేశ్వరి అనే యువతి పనిచేస్తోంది. అక్కడ ఓ విలేఖరి అలాగే ఆమెతో పనిచేసే మరో ఉద్యోగి ఆమెని తమ కోరిక తీర్చాలి అని వేధించేవారు.
ఈ సమయంలో రూరల్ పోలీసు స్టేషన్ లో అనితా రాజేశ్వరి తల్లి ఏఎస్‌ఐగా పనిచేస్తున్నారు.. ఆమెకి తన బాధ చెప్పింది వెంటనే వారిని పిలిచి వార్నింగ్ ఇచ్చారు ఆమె.. కాని వారిలో మార్పు రాలేదు ఇంకా వేధింపులు ఎక్కువ అయ్యాయి, దీంతో ఆమె అదే ఆఫీసులో విషం తాగింది దీంతో ఆమెని వెంటనే ఆస్పత్రికి తరలించారు.