కొందరు నీచులు కన్న తల్లిని కూడా భారం అనుకుంటారు, తొమ్మిది నెలలు మోసి కడుపులో ఇంతలా సృష్టిలోకి తీసుకువచ్చిన తల్లిని కూడా చంపాలి అని అనుకున్నాడు ఈ దుర్మార్గుడు, బీజింగ్ కు చెందిన ఓ వ్యక్తి తన తల్లి పక్షవాతంతో ఉండటంతో ఆమెకి సేవ చేయలేకపోతున్నాడు, కొద్ది కాలంగా ఆమెని భారంగా భావిస్తున్నాడు, ఈ సమయంలో..
చక్రాల కుర్చీలో ఆమెని బయటకు తీసుకువెళ్లాడు, చివరకు ఓ ప్రాంతంలో ఆమెని సమాధి చేశాడు, తిరిగి ఇంటికి వచ్చాడు, భార్య మీ అమ్మ ఏది అని అడిగితే బిత్తర సమాధానం చెప్పాడు, దీంతో ఆమె రెండు రోజులకి పోలీసు కంప్లైంట్ ఇచ్చింది.
పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తే వెంటనే నిజం చెప్పాడు, ఆమెని చూసేందుకు పోలీసులు వెళ్లారు ఆమె సమాధిని చూస్తే కొన ఊపిరితొ కొట్టుమిట్టాడుతోంది, వెంటనే ఆమెని ఆస్పత్రికి తరలించి కొడుకుని జైలులో పెట్టారు, బీజింగ్ లో జరిగింది ఈ దుర్మార్గపు ఘటన.