మృగశిర వచ్చిందంటే చాలు, కార్తె ప్రవేశం రోజున చాలా చోట్ల చేపలు కొంటూ ఉంటారు. అయితే చాలా మంది ఈ రోజు చేపలు తినాలి అని పెద్దలు చెప్పారు కాబట్టి తింటారు. కాని వాస్తవంగా ఈ రోజు చేపలు ఎందుకు తీసుకుంటారు అంటే ఓ రీజన్ ఉంది.
రోహిణి కార్తె ముగిసి ఇక చల్లటి వర్షాలు మొదలవుతాయి. జూన్ 8వ తేదీ ప్రారంభం అవుతుంది. అయితే ఈ కార్తె మొదటి రోజుకి ఓ ప్రాముఖ్యత ఉంది. తొలి రోజు అందరూ చేపలు తింటారు, ఎందుకంటే ఆరోగ్యం కోసం. ఈ కార్తెలో ఎక్కువగా మనిషి శరీరంలో మార్పులు జరిగి, ఎక్కువ మంది వ్యాధుల బారిన పడే ప్రమాదముంది.
గుండె జబ్బు, అస్తమా బాధితులు ఇబ్బందులు పడతారు ఈ వర్షాకాలం. అందుకే ఈ సమస్యలు రాకుండా చేపలు తింటారు. ఈ కార్తె కూడా 15 రోజుల పాటు ఉంటుంది. మన శరీరంలో ఉష్ణోగ్రతలు ఈ వర్షాలకు చల్లబడతాయి,ఈ సమయంలో అనేక రోగాలు పలకరిస్తాయి. అందుకే శరీరంలో వేడి ఉండేందుకు చేపలను తింటారు. మరి మాంసాహారులు చేపలు తింటే, ఇక శాఖాహారులైతే ఇంగువను బెల్లంలో కలుపుకుని గోలిలాగా తయారు చేసుకొని తింటారు.