ఎమ్మార్వో ఆఫీస్ కి పెట్రోల్ తీసుకెళ్లిన రైతు ఏమైందంటే

ఎమ్మార్వో ఆఫీస్ కి పెట్రోల్ తీసుకెళ్లిన రైతు ఏమైందంటే

0
113

ఈ మధ్య కాలంలో పనుల మీద ఎమ్మార్వో ఆఫీసులకి వెళ్లేవారి కంటే ..పెట్రోల్ బాటిల్ తో వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో అయితే పెట్రోల్ కావాలి అంటే బాటిల్స్ తెస్తే ఇవ్వం అనేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, కాని రైతులు ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది, వేలకి వేలు జీతాలు తీసుకుంటూ, లక్షల రూపాయల అవినీతి సొమ్ముతో జల్సాలు చేస్తున్న కొందరు ఉద్యోగులకు ఇదే సరైన శిక్ష అంటున్నారు, కోట్ల రూపాయల ఆస్తులు రెవెన్యూ ఉద్యోగులకు ఉండటానికి కారణం, వేళ్లతో పేరుకుపోయిన అవినీతి అని రైతులు గగ్గోలు పెడతున్నారు, పాస్ పుస్తకం నుంచి శిస్తు రశీదు వరకూ అంతా అవినీతి మయం చేశారు అని విమర్శిస్తున్నారు.

తెలంగాణలో ఎమ్మార్వో విజయారెడ్డిపై ఇలాగే పెట్రోల్ పోసి దాడి చేసి ఆమెని చంపేశాడు ఓ రైతు.. ఇప్పుడు ఇలాంటి దాడులకు రెడీ అవుతున్నారు కొందరు రైతులు. తాజాగా మంగళగిరిలో ఓ రైతు ఎమ్మార్వో ఆఫీసుకి పెట్రోల్ తీసుకువెళ్లాడు… తనకు పాస్ పుస్తకం ఇవ్వడం లేదు అని వాపోయాడు,వెంటనే సిబ్బంది గుర్తించి అతన్నీ ఆపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు వచ్చి అతనిని అదుపులోకి తీసుకున్నారు.

ఇటువంటి ఘటనలు రోజురోజుకి ఎక్కువై పోతుండటంతో .. రాష్ట్రంలోని చాలామంది ఎమ్మెల్యే లు ఎమ్మార్వోలు పోలీసుల రక్షణ కోరుతున్నారు. మరికొందరు ఎమ్మార్వోలు నెలకు 10 వేలు ఇచ్చి పర్సనల్ సెక్యూరిటీ పెట్టుకుంటున్నారు..ఎవరైనా ఎమ్మార్వోని కలవడానికి వస్తే తనిఖీ చేసి పంపుతున్నారు.