ముద్దులతో 24 మందికి కరోనా ? అస్లామ్ బాబా మరణం

ముద్దులతో 24 మందికి కరోనా ? అస్లామ్ బాబా మరణం

0
86

కొందరు విచిత్రంగా కొన్ని మాటలు చెబుతూ ఉంటారు …ఈ వైరస్ పోవాలి అని అందరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ పెట్టుకుని జాగ్రత్తలు తీసుకుంటుంటే, ఓ బాబా మాత్రం ముద్దు పెట్టుకుంటే కరోనా పోతుందంటూ ప్రచారం చేశాడు. అలా తన ఆశ్రమానికి వచ్చినవారిని ముద్దులు పెట్టేసుకున్నాడు. కట్ చేస్తే ఆ బాబా కరోనా వచ్చి మరణించాడు…

దీంతో ఆరోజు ఆయనకు ముద్దులు పెట్టిన వారు షాకయ్యారు, మాకు టెస్టులు చేయండి అంటూ పరుగులు పెట్టారు ఆస్పత్రికి.
ఆ బాబాతో ముద్దులు పెట్టించుకున్న 24మందికి కరోనా సోకింది..ఆ బాబా పేరు అస్లామ్ బాబా. అస్లాం బాబాగా ప్రచారం పొందిన అన్వర్ షా రత్లం జూన్ 4న కరోనా సోకి మృతి చెందాడని ప్రకటించారు.

మధ్యప్రదేశ్లో.రత్నాలం జిల్లాలో మొత్తం 85 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది.. వీరిలో ఒక్కరి వల్లే 19 మందికి వైరస్ సోకినట్టు డాక్టర్లు గుర్తించారు. ఇంకా పలువురికి టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. ఇలాంటివి ఎవరైనా చెపితే గుడ్డిగా నమ్మకండి అంటున్నారు అధికారులు.