రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంపాదన గంటకు ఎంతో తెలుసా

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంపాదన గంటకు ఎంతో తెలుసా

0
103

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ సంపద ఈ ఏడాది మరింత పెరిగింది, జియో లాభాలతో పెట్టుబడులతో ఆయన అపరకుబేరుడిగా మారారు, ప్రపంచంలో టాప్ 10 ధనవంతుల్లో ఆయన ఒకరు, ఇక మన దేశంలో రిచ్చెస్ట్ పర్సెన్ కూడా ఆయనే, భారత దేశంలో కుబేరుడు ముఖేష్ అంబానీ.

అయితే ఆయన సంపాదన మొత్తం ఆస్తి ఎంతో తెలుసా రూ.6.58 లక్షల కోట్లు, అంతేకాదు
ఆగస్టు 31తో ముగిసిన 12 నెలల కాలంలో ఆయన సంపద 73శాతం పెరిగింది. దీంతో ఆయన సంపద రూ.6.58 లక్షల కోట్లకు చేరింది. రెండో స్థానంలో హిందుజా సోదరులు ఉండగా.. మూడో స్థానంలో శివ్నాడార్ కుటుంబం ఉంది.

ఆ తర్వాతి స్థానాల్లో అజీమ్ ప్రేమ్జీ, సైరస్ పూనావాలా, రాధాకృష్ణ దమాని, ఉదయ్ కొటాక్, దిలీప్ సంఘ్వీ, సైరస్ మిస్త్రీ, షాపూర్జీ పల్లోంజీ మిస్త్రీ ఉన్నారు. వీరిలో ఏడుగురు ముంబై వారే ఉన్నారు,ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా సంపన్నుల జాబితాలో వరుసగా తొమ్మిదో ఏట కూడా ప్రథమ స్థానంలో నిలిచారు ముఖేష్ అంబానీ. అంబానీ ప్రపంచంలోనే టాప్-5 స్థానంలో ధనవంతుల్లో ఉన్నారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపాదన… గంటకు రూ. 90 కోట్లు.