కడపలో మున్సిపల్ అధికారులు విఫలం..

0
109

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మండుటెండల్లో తుఫాను దూసుకొస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. ఈ తుఫాన్ దాటికి ఏపీలో పలు ప్రాంతాల్లో  ఇవాళ, రేపు, ఎల్లుండి మూడు రోజులు పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా కడప జిల్లాలో అసని తుఫాను ప్రభావంతో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి.

కడప నగరంలో రోడ్లు సక్రమంగా లేకపోవడంతో లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యి.. కాలువలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపైకి చేరిన భారీ వర్షపు నీరు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజిలో అధిక నీరు చేరడం కారణంగా వాహనదారులు నానాతిప్పలు పడుతున్నారు. ప్రతిసారి వర్షం పడితే ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ వర్షాల కారణంగా మున్సిపల్ అధికారులు విఫలం కావడం జరిగింది.