ఆరునెలలగా మైనర్ బాలికపై అత్యాచారం….

ఆరునెలలగా మైనర్ బాలికపై అత్యాచారం....

0
103

ఏపీలో దారుణం జరిగింది… యలమంచిలి మండలం కొత్తపలి గ్రామంలో నివాసం ఉంటున్న ఒక మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆ మైనర్ బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడుతున్నారు…

ఈ బాలికకు తల్లిదండ్రులు లేకపోవడంతో నానమ్మదగ్గర ఉంటోంది…. అయితే ఆక్రమంలో బాలిక అనారోగ్యంతో ఉండటంతో బాలికను పిన్నీ ఇటీవలే ఆసుపత్రికి తీసుకువెళ్లింది… వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె ఆరునెలల గర్బవతి అని చెప్పారు… దీంతో కుటుంబ సభ్యులు ఆందోళతో బాలికను ఆరాతీశారు…

దీంతో ఆ బాలిక విషయం చెప్పింది… గత ఆరునెలలుగా అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బెదిరించి లైంగిక దాడి చేస్తున్నారని ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని తెలిపింది… దీంతో కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు… వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు… ప్రస్తుతం నిందితులు పరారిలో ఉన్నారు…