నిర్భయ దోషిపై జైల్లో అత్యాచారం..

నిర్భయ దోషిపై జైల్లో అత్యాచారం..

0
83

నిర్భయ కేసులో నలుగురు దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయబోతన్నారు. దానికి సంబంధించి తీహార్ జైల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉరిశిక్షను వాయిదా వేసేందుకు దోషులు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన క్షమాబిక్షను తిరస్కరించాడాన్ని సవాల్ చేస్తూ దోషుల్లో ఒకరైన ముకేష్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

ఈ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఆర్ భానుమతి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముకేష్ సింగ్ తరపు లాయర్ వాదనలను విన్నది. ఈ సందర్భంగా ముకేష్ సింగ్ లాయర్ సంచలన ఆరోపణలు చేశారు. జైల్లో ముకేష్ సింగ్‌పై దాడి జరిగిందని..

అంతేకాదు అత్యాచారం కూడా చేశారని ఆరోపించాడు. క్షమాభిక్ష పిటిషన్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించినా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన అభ్యర్థనను తిరస్కరించారని పేర్కొన్నాడు.