నగ్న వీడియోలు పంపింది చివరకు తన ప్లాన్ అమలు చేసింది

నగ్న వీడియోలు పంపింది చివరకు తన ప్లాన్ అమలు చేసింది

0
105

కొంతమంది ఈ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ద్వారా మంచిని కూడా చెడుకు వాడుతున్నారు, సైబర్ నేరాలకు పాల్పడే వారు ఇలాంటి చెత్త పనులు ఎన్నో చేస్తున్నారు, తాజాగా ఓ యువతి ఐటీ ఎంప్లాయ్ కి వల వేసి ఏకంగా లక్షలు కొట్టేసింది, సో ఇది ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పడానికి ప్రతీ ఒక్కరు తెలుసుకోవలసిన విషయం.

ఐటీ కారిడార్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్కు ఇటీవల ఇన్స్టాగ్రాం ద్వారా ఓ యువతి పరిచయం అయింది. అది క్రమంగా స్నేహంగా మారి మరింత ముదిరింది. తర్వాత ఇద్దరూ పరస్పరం ఫొటోలను మార్చుకున్నారు. ఇద్దరూ న్యూడ్ వీడియోలు పంపుకున్నారు, అంత వరకూ బాగానే ఉంది.

అయితే తర్వాత అతని వీడియోలు నెట్ లో పెడతాను అని ఆమె భయపెట్టింది.. ఇలా చేయకుండా ఉండాలి అంటే నగదు పంపాలి అని కోరింది.. సుమారు 3 లక్షలు ఇచ్చాడు, అయినా వేధింపులు పెరిగాయి 10 లక్షలు అడగడంతో, అతను పోలీసులను ఆశ్రయించాడు, ఇప్పుడు ఆమె కోసం వేట కొనసాగుతోంది.