నేచర్ లవర్స్ ఈ అందమైన ప్రదేశాలను చుట్టొచ్చారా..?

0
114

మనలో చాలామంది ప్రకృతి అందాలను చూసేందుకు వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. పచ్చని ప్రకృతి రమణీయతలో పారవశ్యం పొందాలని ఉవ్విళ్లూరుతుంటారు. ముఖ్యంగా జలపాతాల వద్ద పర్యాటకుల సందడి అంతా ఇంతా కాదు. మీరు కూడా ప్రకృతి రమణీయతతో అలరారే ఎన్నో టూరిస్ట్ ప్రాంతాలను చుట్టేయాలంటే రాజస్థాన్ లోని ఈ ప్రదేశాలను చూడాల్సిందే..

వర్షాకాలంలో రాజస్థాన్‌కు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే మౌంట్ అబూకు తప్పకుండా వెళ్లాలి. ఎందుకంటే ఈ పర్యాటక ప్రదేశం వర్షంలో మరింత అందంగా కనిపిస్తుంది. అంతేకాకుండా రాజస్థాన్ లో  సజ్జన్‌గఢ్ ప్యాలెస్ కూడా అందరికి ఆకట్టుకుంటుంది. ఎందుకంటే ఈ ప్యాలెస్​లో ఎన్నో సరస్సులు ఉన్నాయి.

ఆ సరస్సుల్లో బోటింగ్ చేస్తూ చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను తిలకిస్తూ.. పక్షుల కిలకిలరావాల మధ్య ప్రయాణం చేస్తూ ఉంటే స్వర్గంలో విహరిస్తున్నట్లే ఉంటుంది. రాజస్థాన్​లో ఉన్న మహో హిల్ స్టేషన్ అచల్‌ఘర్ హిల్ పర్వతం మౌంట్ అబూ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశానికి  కుటుంబ సమేతంగా వెళ్తే భలే ఎంజాయ్ చేయవచ్చు.