MBBS విద్యార్ధినికి షాక్ ఇచ్చిన 9 తరగతి కుర్రాడు ఏం చేశాడంటే

MBBS విద్యార్ధినికి షాక్ ఇచ్చిన 9 తరగతి కుర్రాడు ఏం చేశాడంటే

0
95

చిన్న కుర్రాడు తమ్ముడు లాంటి వాడు కదా అని ఆమె అనుకుంది ఆమె డాక్టర్ చదువుతోంది ఇంటి పక్కన ఈ యువకుడు 9 వ తరగతి చదువుతున్నాడు, ఇక అడిగిన సమయంలో గేమ్స్ కోసం వీడియోలు చూసేందుకు ఆమె సెల్ ఫోన్ ఆ కుర్రాడికి ఇచ్చేది అయితే ఇతను మాత్రం ఆమె మొబైల్ తీసుకుని ఇటీవల ఆమె ఫోన్ లో మెయిల్ ఐడీ పాస్ వర్డ్ మార్చేవాడు, ఆమె సోషల్ మీడియా ఖాతాలు మార్చేశాడు.

 

ఇక తర్వాత రోజు నుంచి ఆమె పేరుతో ఆన్ లైన్ క్లాసుల్లో అసభ్య సందేశాలు పెట్టడం.. ఆమె ఫేస్ బుక్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాల్లో అశ్లీల చిత్రాలు పోస్ట్ చేయడం చేశాడు, ఆమె తన ఖాతాలు హ్యాక్ అయ్యాయి అని బాధపడింది.

అయితే ఈ బాధ ఎవరికి ఆమె చెప్పుకునేది కాదు.. ఇలా ఎవరు చేస్తున్నారో ఆమెకి అర్దం అవ్వలేదు… ఇక ఎవరికి చెప్పకుండా వీడికే చెప్పేది.. ఈ బాలుడు కూడా తనకు ఏమీ తెలియనట్టు ఉండేవాడు.

 

కాని ఇటీవల ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసింది దీంతో పూర్తి వివరాలు తెలుసుకుంటే అన్నీ నిజాలు బయట పడ్డాయి.. ఇప్పుడు అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తే అన్ని విషయాలు తెలిశాయి, ఈ విషయం తెలిసి ఆమె షాక్ అయింది. పోలీసులు బాలుడిని అరెస్ట్ చేసి జువైనైల్ హోంకు తరలించారు.