రమాదేవి స్ధానికంగా వంటలు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.. అక్కడ రమణ అనే వ్యక్తి ఆమెకి పరిచయం అయ్యాడు, అతని వయసు 31 సంవత్సరాలు.. రమాదేవి వయసు 40 ఏళ్లు.. అయితే రమాదేవి భర్త లేకపోవడంతో ఆమె రమణతో అక్రమ సంబంధంపెట్టుకుంది, ఈ సమయంలో వీరిద్దరూ చాలా గఢంగా దగ్గర అయ్యారు.
రమణకి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు అని తెలిసి ఇక విడిపోదాం అన్నాడు, కాని ఆమె మాత్రం మనం విడిపోవద్దు నీకు నా కూతురిని ఇచ్చిపెళ్లి చేస్తాను అని చెప్పింది, తనకు ఉన్న ఇళ్లు కట్నంగా ఇస్తాను ఇద్దరితో ఉందువు అని చెప్పింది.
దీంతో వీరి వ్యవహరం తెలిసిన అక్కడ పనిచేసే రాజు, ఇది తప్పు అని రమణికి చెప్పాడు, అయినా రమణ మాట వినలేదు, రమాదేవి తన కూతురికి మాత్రం అతను మంచివాడు నాకు బాగా తెలిసిన వ్యక్తి అని పెళ్లి చేయడానికి సిద్దం అయింది, ఈ సమయంలో 10 మంది సమక్షంలో పెళ్లి చేయాలి అని భావించింది. కాని వీరి మోసం తెలిసిన రాజు పోలీసులకు సమాచారం ఇచ్చాడు, వీరి వ్యవహరం బయటపడింది.. అంతేకాదు తల్లి మోసం గ్రహించి మేనత్త దగ్గరకు వెళ్లిపోయింది రమాదేవి కూతురు, వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.