గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను హత్య చేసి గోనె సంచిలో వేసుకుని నెల్లూరు జిల్లా కోవ్వూరు మండలం పడుగుపాడు రహదారిలో మృత దేహాన్ని వదిలేశారు… గోనె సంచిని చూసిన స్థానికులు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు…
రంగంలోకి దిగిన పోలీసులు సంచిని బయటకు తీయించారు… అందులో మహిళా మృత దేహం కనిపించింది… నైటీలో ఉన్న మహిళ తీవ్రగాయాలతో ఉంది… అమెను హత్య చేసి గోనె సంచిలో వేసి బూట్ల లేస్ తో కట్టి పడేశారని పోలీసులు తెలిపారు…
ఈ హత్య జరిగి సుమారు మూడు రోజులు అయి ఉంటుందని మృత దేహం గుర్తు పట్టలేని విధంగా ఉందని పోలీసులు తెలిపారు… స్థానికంగా ఉన్న గ్రామాల్లో విచారించామని అనుమాస్పద కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు…