నేరం ఒప్పుకున్నాడు శిక్ష వేశారు? అతనిని జైలులో పెట్టలేదు విచిత్ర కేసు

నేరం ఒప్పుకున్నాడు శిక్ష వేశారు? అతనిని జైలులో పెట్టలేదు విచిత్ర కేసు

0
94

ఇది ఎప్పుడూ ఎక్కడా వినని ఘటన అనే చెప్పాలి, ఎవరికైనా కోర్టులు శిక్ష విధించిన సమయంలో కచ్చితంగా అతనిని జైలుకి పంపిస్తారు.. కాని ఇక్కడ చాలా విచిత్ర పరిస్దితి ఎదురైంది.
ఆస్ట్రేలియాలోని ఓ వ్యక్తి తాను నేరం చేసినట్లు కోర్టులో ఒప్పుకొన్నా.. ఆయన్ను జైలుకు పంపడానికి న్యాయమూర్తి నిరాకరించారు.

పీటన్ జాన్ ఒనీల్ అనే 61 ఏళ్ల వ్యక్తి టీచర్ గా పనిచేసేవాడు, ఈ సమయంలో చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అని ఆరోపణలు వచ్చాయి, విచారణ జరిపారు, ఇది వాస్తవం అని తేలింది, నిజం ఒప్పుకున్నాడు.

దీంతో అతడు దోషిగా తేలినా లావుగా ఉన్నాడని జైలుకు పంపేందుకు న్యాయమూర్తి నిరాకరించాడు. గతంలో ఫిట్గానే ఉన్న పీటర్ తర్వాత లావుగా మారిపోయాడు. ఇక అతను చాలా లావు అయ్యాడు నడవడానికి కూడా కష్టంగా ఉంది, వీల్ చైర్ కి పరిమితం అయ్యాడు.. ఏపని చేయలేడు, ఇక అతనిని జైలుకి పంపాలి అంటే మెడికల్ హెలీకాఫ్టర్ కావాలి.. దానికి 30 లక్షలు అవుతుంది అని ఆలోచించారు, త్వరలో దీనిపై కీలక నిర్నయం తీసుకుంటాము అన్నారు, ప్రస్తుతం పోలీస్ సెక్యూరిటీలో అతనిని ఇంట్లోనే ఉంచుతున్నారు.