వాహనదారులకు కొత్త రూల్స్ బైక్ కారు నడిపేవారు ఇవి పాటించాల్సిందే

వాహనదారులకు కొత్త రూల్స్ బైక్ కారు నడిపేవారు ఇవి పాటించాల్సిందే

0
109

చాలా మంది బైకు కారు నడిపేవారు ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదా ? అయితే ఇక మీకు జరిమానాలు శిక్షలు కూడా పడతాయి. కేంద్రం తాజాగా ఇచ్చిన రూల్స్ అన్నీ పాటించాలి అని తెలిపింది,
ఇకపై హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు దొరికితే రూ. 1,000 జరిమానా కట్టాల్సిందే. అంతేకాదు మూడు నెలలు మీ డ్రైవింగ్ లైసెన్స్పై కూడా అనర్హత వేటు పడుతుంది.

ఈ సమయంలో మీరు బండినడిపితే మరో కేసు కూడా నమోదు చేస్తారు, కఠిన నిబంధనలు ఇక అమలు చేయాలి అని కేంద్రం తెలిపింది, ఇప్పటికే గత ఏడాది సెప్టెంబర్ 1 నుంచి కొత్త మోటారు వాహన చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చింది.

దీని ప్రకారం ఈ రూల్స్ పాటించాలి..ఈ చట్టంలో ఉన్న 11 సెక్షన్లలో జరిమానాలు తగ్గించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కల్పించింది. అయితే మరికొన్ని సెక్షన్లలో జరిమానాలు తగ్గించాలి అని కోరారు.. కాని ఇలా కఠినంగా ఉండాల్సిందే అని ప్రమాదాలు తగ్గించేందుకు ఇవి ఉపయోగపడతాయి అని అంటున్నారు అధికారులు.. ఇక వీటిపై ఎలాంటి సడలింపులు ఉండబోవని కేంద్రం తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఏపీలో కొత్త మోటారు వాహన చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సో వాహనాలు నడిపేవారు అన్నీ రూల్స్ తప్పక పాటించాల్సిందే.