బ్రేకింగ్ – రైల్వే ప్రయాణికులకు కొత్త రూల్స్ ఈ నిబంధనలు పాటించకపోతే జైలుశిక్ష ఫైన్లు

బ్రేకింగ్ - రైల్వే ప్రయాణికులకు కొత్త రూల్స్ ఈ నిబంధనలు పాటించకపోతే జైలుశిక్ష ఫైన్లు

0
190

పండుగ సీజన్లో రైల్వే ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది, అయితే తాజాగా పలు రైళ్లు పట్టాలెక్కాయి, ఈ కరోనా
సమయంలో చాలా వరకూ స్పెషల్ రైళ్లు నడిపిస్తోంది రైల్వేశాఖ.. అయితే ఇప్పుడు కచ్చితంగా రైల్వే ప్రయాణికులు రైలు ప్రయాణం చేయాలి అంటే కొన్ని రూల్స్ చెబుతోంది, అవి కచ్చితంగా ప్రయాణికులు పాటించాలి అని చెబుతున్నారు రైల్వే పోలీసులు..

ఒకవేళ ఈ రూల్స్ పాటించకపోయినా అతిక్రమించినా భారీ ఫైన్లు అలాగే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అని తెలిపారు.
ఇండియన్ రైల్వేస్ పండుగ సీజన్ నేపథ్యంలో మరో 392 స్పెషల్ ట్రైన్స్ను పట్టాలెక్కిస్తున్నట్లు ప్రకటించింది. మరి ఆ రూల్స్ చూద్దాం.

1. మీరు రైలు ప్రయాణం చేస్తే కచ్చితంగా మాస్క్ ధరించాల్సిందే
2.సరిగ్గా ఆఫ్ మాస్క్ పెట్టుకున్నా మీకు ఫైన్ పడుతుంది
3.. ప్రయాణికులు వ్యక్తికి వ్యక్తికి మధ్య దూరం కూడా పాటించాల్సి ఉంటుంది.
4. కరోనా టెస్ట్ చేయించుకుని ఫలితం రాకుండా ప్రయాణం చేయకూడదు
5. కరోనా పాజిటీవ్ ఉండి ప్రయాణం చేస్తే వారిపై కేసు నమోదు చేస్తారు
6. రైల్వే పరిసరాల్లో ఉమ్మి వేసినా శిక్ష పడుతుంది
7. రైల్వే చట్టంలోని సెక్షన్ 145, 153, 154 కింద వీరిపై కేసులు నమోదవుతాయని హెచ్చరించింది, ఇలాంటి తప్పులు చేస్తే నెల నుంచి ఐదు సంవత్సరాల జైలు శిక్ష వేస్తారు.