నిర్భయ కేసులో దోషులు నలుగురిపై షాకింగ్ డెసిషన్

నిర్భయ కేసులో దోషులు నలుగురిపై షాకింగ్ డెసిషన్

0
80

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన నిర్భయ కేసులో దోషులు నలుగురికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ క్షమాభిక్షను నిరాకరించిన విషయం తెలిసిందే, ఏకంగా ఆమెపై జరిగిన దారుణానికి చట్టాన్నే తీసుకువచ్చారు.. కాని ఆమె కేసులో మాత్రం ఈ నలుగురికి ఇంకా శిక్ష అమలు చేయలేదు, తాజాగా వీరికి క్షమాబిక్ష ఇవ్వకూడదు అని అందరూ కోరుతున్నారు.

దీనిపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సైతం వారిని వదిలేది లేదు అని భావించారు. దీంతో వారిని ఉరి తీయడానికి తీహార్ జైలు అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. ఈ నెల 7న వీరిపై డెత్ వారెంట్ తీర్పు వెలువడనున్నట్టు తెలుస్తుండగా, నలుగురినీ ఒకేసారి ఉరి తీయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే తలారిని కూడా సిద్దం చేసుకున్నారు,ఇక తలారి గురించి డీటెయిల్స్ మాత్రం ఇవ్వడం లేదు కాని ప్రొసీడింగ్స్ అన్నీ జరుగుతున్నాయట.

అయితే, ప్రస్తుతం తీహార్ జైలులో ఒకే ఉరికంబం ఉండడంతో, మరో మూడింటిని నిర్మిస్తున్నారు. పీడబ్ల్యూడీ విభాగం సిబ్బంది ఈ పనుల్లో నిమగ్నమైంది. నూతనంగా మూడు ఉరికంబాలను, మూడు సొరంగాల నిర్మాణాన్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. కాగా, తీహార్ జైల్లో ఉరి తీసే ప్రదేశంలో మొత్తం 16 డెత్ సెల్స్ ఉండగా, రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించగానే, నలుగురినీ నాలుగు వేర్వేరు గదులకు జైలు అధికారులు మారుస్తారు.